దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానం

22-04-2019

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానం

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన వారంతా సంప్రదాయ దుస్తులతో రావడం ప్రత్యేకత సంతరించుకుంది. బాలీవుడ్‌ నటీమణులు కాజోల్‌, అతిథిరావు హైదరి, అపర్శక్తి, ఖురాన్నా, ప్రనుతాస్‌, అమృతరావు, శ్రియ, కియారా అద్వాని, కొరియోగ్రాఫర్‌ కరోజ్‌ ఖాన్‌, గాయకుడు ఉదిత్‌ నారాయణ తదితరులు హాజరయ్యారు. ఇందులో ధడక్‌తో అరంగ్రేటం చేసిన శ్రీదేవి తనయ జాన్వి కపూర్‌, ఇషాన్‌ కట్టర్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందుకున్నారు. డిజిటల్‌ సన్షెషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును సాఖిబ్‌ సలీమ్‌, కుబ్రా సైట్‌ గెలుచుకున్నారు. టీవీ నటి సుమోనా చక్రవర్తి, గాయకుడు గురు రంధవలకు దాదా సాహెబ్‌ పురస్కారాలు వరించాయి.