పోర్చుగల్ లో మన్మథుడి కసరత్తులు

20-04-2019

పోర్చుగల్ లో మన్మథుడి కసరత్తులు

నాగార్జున తన కొడుకుల కంటే ఆరోగ్యంగా, అందంగా ఉంటారని అఖిల్‌ నాగచైతన్యే స్వయంగా ఓ సినిమా ఫంక్షన్‌లో పేర్కొన్నారు. నాగ్‌ అలా ఉండడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన హీరోగా మన్మథుడు కి సీక్వెల్‌ చేస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్‌ నాగుకు సంబంధించిన లుక్స్‌ను సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. దిస్‌ మ్యాస్‌.. ఫిట్‌నెస్‌ గోల్స్‌. కింగ్‌ ఫ్యాన్స్‌... ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే అని క్యాప్షన్‌ ఇచ్చారు.  ఈ ఫొటోల్లో నాగార్జున కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సమంత అతిథి పాత్రలో నటిస్తుంది. నాగార్జున, పి.కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా కథ దాదాపుగా పోర్చుగల్‌ చుట్టూ తిరుగుతుంది. లక్ష్మి వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, నాజర్‌ ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.