డ్యాన్స్ బేస్డ్ మూవీలో సాయిపల్లవి

20-04-2019

డ్యాన్స్ బేస్డ్ మూవీలో సాయిపల్లవి

డ్యాన్స్‌ మాస్టర్‌, నటుడు, దర్శకుడు ప్రభుదేవాకు డ్యాన్స్‌ బేస్డ్‌ సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం. ఓవైపు దర్శకుడిగా, ఇంకోవైపు నటుడిగా బిజీగా ఉన్న ఆయన త్వరలో మరో డ్యాన్స్‌ బేస్డ్‌ మూవీ చేయాలనే ఆలోచనతో ఉన్నారట. అయితే ఈ సినిమా కోసం దర్శకుడిగా మరో వ్యక్తిని అనుకుంటున్నారట ప్రభుదేవా. ఇందుకోసం ఓ యువ దర్శకుడితో ఆయన చర్చలు సాగిస్తున్నారని తెలిసింది. ఈ డ్యాన్స్‌ బేస్డ్‌ మూవీలో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకున్నారనీ.. ఆమె చుట్టూనే సినిమా కథ అంతా నడుస్తుందని సమాచారం. సాయి పల్లవి మంచి డ్యాన్సర్‌. ఈ చిత్రంలో ప్రభుదేవాతో కలిసి ఆమె చేసే డ్యాన్స్‌ ప్రేక్షకులను అదరగొట్టడం ఖాయం. మరో డ్యాన్సింగ్‌ బ్యూటీ సయేషా సైగల్‌ కూడా ఈ సినిమాలో నటించనుందని తెలిసింది. ఇక ప్రస్తుం తన తాజా సినిమా అభినేత్రి 2 విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు ప్రభుదేవా. ఆ సినిమా విడుదలైన తర్వాతే సాయిపల్లవితో చేసే సినిమా గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.