13 ఏళ్ల తర్వాత మళ్లీ జోడిగా

20-04-2019

13 ఏళ్ల తర్వాత మళ్లీ జోడిగా

క్రైమ్‌ నేపథ్యంలో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం అందా దున్‌ సౌత్‌ రీమేక్‌ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దీన్ని తెలుగు, తమిళలో సిద్ధార్థ హీరోగా రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ విషయంపై సిద్ధార్థ్‌ కొద్దిరోజుల క్రితమే ఆసక్తిగా ఉన్నానని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటించే అవకాశాలున్నాయని తెలిసింది. హిందీ వెర్షన్‌లోని రాధికా ఆప్టే క్యారెక్టర్‌ను త్రిష చేయనుందని తెలిసింది. 13 ఏళ్ల తర్వాత ఈ జోడీ రిపీట్‌ కాబోతుండం విశేషం.