మూడు నెలల్లో బాలయ్యతో సినిమా

20-04-2019

మూడు నెలల్లో బాలయ్యతో సినిమా

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో మరో మూడు నెలల్లో చిత్రం తీయడానికి సిద్దమవుతున్నట్లు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మనవరాలి పుట్టు వెంట్రుకలు, అక్షరాభ్యాసం మొక్కు తీర్చుకునేందుకు వచ్చామని, ఏదైనా కార్యక్రమానికి ముందు స్వామిని దర్శించుకోవడం తనకు అనవాయితీగా వస్తోందన్నారు. బాలయ్య బాబుతో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మరో మూడు నెలల్లో చిత్రాన్ని మొదలు పెడతామని ఆయన తెలిపారు.