కేజ్రీవాల్ తో ప్రకాశ్ రాజ్ భేటీ

11-01-2019

కేజ్రీవాల్ తో ప్రకాశ్ రాజ్ భేటీ

సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలోని కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి ఆయన వెళ్లారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌కు ఆప్‌ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటిండచంపై ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళ కమిషన్‌ నోటీసులు జారీ చేయడంపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. రాహుల్‌ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.