రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ప్రభుత్వ సత్కారం

20-12-2017

రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ప్రభుత్వ సత్కారం

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, రాష్ట్రపతికి శాలువా కప్పి నెమలి శిల్పాని జ్ఞాపికగా అందించారు. గవర్నర్‌ నరసింహన్‌, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వేదికపై ఉన్నారు. వేల సంఖ్యలో తరలి వచ్చిన తెలుగు సాహితీ మూర్తులు భాషాభిమానులతో హైదరాబాద్‌ లాల్‌ బహదూర్‌ స్టేడియం కిటకిటలాడింది.