ప్రతి డిసెంబర్‌లో తెలంగాణ తెలుగు మహాసభలు : కేసీఆర్‌

20-12-2017

ప్రతి డిసెంబర్‌లో  తెలంగాణ  తెలుగు మహాసభలు : కేసీఆర్‌

ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మహాసభల ద్వారా తెలంగాణ సాహితీ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని పేర్కొన్నారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల ముగింపు వేడుకలకు అధ్యక్షత వహించిన కేసీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలుగు మహాసభలను సుసంపన్నం చేసినందుకు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. సభలు విజయవంతమైందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 1974లో డిగ్రీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరై తిలకించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ భాషా వైదుష్యాన్ని సగౌరవంగా ప్రపంచానికి చాటిచెప్పినం అన్నారు.

తెలుగు మహాసభల సందర్భంగా అన్ని భాషల ఉద్దండ పిండాలను ఇతర భాషల నుంచి జ్ఞానపీఠ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కాలు పొందిన సాహితీవేత్తలను తెలంగాణ రాష్ట్రం గొప్ప సన్మానించిందని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబరలో రెండు రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని ప్రకటించారు. తెలుగు పరిరక్షణలో భాగంగా ఇప్పటికే విద్యా సంస్థలో తెలుగును తప్పనిసరి చేశామన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ గడ్డపై చదవుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని సృష్టం చేశారు.