World Telugu Conference from Dec 15 in Hyderabad

సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ పుననిర్మాణంలో ఎన్నారైలు ముఖ్య భూమిక పోషించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపినట్లు టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి శానబోయిన రాజ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రపంచంలోని 42 దేశాలకు చెందిన ఎన్నారైలు హాజరైనట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎన్నారైలు బంగారు తెలంగాణ పున నిర్మిణంలో తమ వంతు ముఖ్య భూమిక పోషించాలని, అదే విధంగా తెలంగాణ ఇండస్ట్రీయల్‌ పాలసీని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపినట్లు రాజ్‌కుమార్‌ వివరించారు.