తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో లేజర్‌ షో కళ్లు మిరుమిట్లు గొలుపుతూ అద్భుతంగా సాగింది. నీలి నింగిని సప్తవర్ణాలతో నింపేసింది. ఎల్బీ స్టేడియంలో అన్ని లైట్లను బంద్‌ చేసి వెంటనే లేజర్‌ షో మొదలైంది. సరిగ్గా రాత్రి 7:29 గంటలకు ప్రారంభమై 15 నిమిషాల పాటు సాగింది. స్టేడియం నలువైపులా సప్తవర్ణాల వెలుగు జిలుగులు విరజిమ్మాయి. వివిధ థీమ్స్‌తో నిమిషానికొక్క విధంగా నడిచింది. ప్రత్యేకించి లయబద్దమైన సంగీతానికి అనుగుణంగా సాగింది. ముగింపు సందర్భంగా పేల్చిన బాణసంచాతో నగరం వెలుగలీనింది.