ధూంధాంగా ముగింపు

19-12-2017

ధూంధాంగా ముగింపు

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ హాజరవుతున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం ఎల్‌బి స్టేడియంలోని పాల్కురికి సోమన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బమ్మెరపోతన వేదికపై జరుగుతాయి. రాష్ట్రపతి నేడు మూడు గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. బేగంపేట నుండి రాజ్‌భవన్‌కు వెళాతారు. కొద్ది సేపు అక్కడ గడుపుతారు. సాయంత్రం ఆరు గంటలకు ఎల్‌బి స్టేడియం వస్తారు. సాయంత్రం 6 గంటల నుండి 7:15 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌ (రాజ్‌భవన్‌)లో గడిపి, బుధవారం మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళతారు. ముగింపు సభలను భారీ ఎత్తున ధూం ధాంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.