గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్‌

18-12-2017

గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్‌

ప్రముఖ కవి, ప్రపంచం మెచ్చిన వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వెంకన్న తన ఆటపాటలతో ఉర్రూత లూగించే సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను దృష్టిలో పెట్టుకుని వెంకన్నకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.