నిత్యం ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మాట్లాడే మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో ఒవైసీ ప్రసంగిస్తూ వేదిక మీదున్న ముఖ్య అతిథులకు నా హృదయ పూర్వక శుభాభివందనాలు. ప్రపంచ తెలుగు మహాసభలు మన హైదరాబాద్‌లో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు మహాసభలను మన ముఖ్యమంత్రి శ్రద్ధతో చేస్తున్నారు. హైదరాబాద్‌లో హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐకమత్వానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని ప్రసంగించారు.