మహాసభల్లో తెలంగాణ ఘుమఘుమలు

16-12-2017

మహాసభల్లో తెలంగాణ ఘుమఘుమలు

తెలుగు మహాసభల్లో తెలంగాణ ఘుమఘుమలు అదరగొట్టాయి. ప్రభుత్వ పరంగా రోజుకు సుమారు అయిదువేల మందికిపైగా అతిథులకు సాదా భోజనాలనే ఉచితంగా సమకూర్చినా, తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్ని రకాల వంటకాలు భోజనప్రియులకు విక్రయాల ద్వారా అందుబాటులో ఉంచారు. ఎల్బీ క్రీడా మైదానంలోనే హోటళ్ల నిర్వాహకులు స్టాళ్లను ఏర్పాటు చేసి అతిథుల జిహ్వాచాపల్యాన్ని తీర్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పలు వంటకాలను అందుబాటులో ఉంచారు. అంబలి మొదలుకొని సర్వపిండి వరకు, జొన్నగుడాలు మొదలు మలీదముద్దల దాకా, మిర్చిబజ్జీ నుంచి చికెన్‌ బిర్యానీ దాకా, ఇలా పలు రకాల తెలంగాణ వంటకాల్ని, పిండివంటల్ని విక్రయించడంతో తొలిరోజు స్టాళ్ల వద్ద సందడి నెలకొంది.