telugu mahasabhala kits distribution

ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్న జీహెచ్‌ఎంసీ పరిధిలోని బాషాభిమానులకు రవీంద్రభారతిలో కిట్లు పంపిణీ చేశారు. తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పేరు నమోదు చేసుకున్న వారికి ట్యాంక్‌బండ్‌ బుద్దపూర్ణిమ భవన్‌లో కిట్లను అందజేస్తున్నారు. ఈ కిట్లలో మహాసభల కరదీపిక, వాగ్భూషణం, భాషణం అనే పుస్తకం, మన తెలుగు అనే చేతి పుస్తకం, నోట్‌ ప్యాడ్‌, ప్రశంసాపత్రం, గుర్తింపుకార్డు, పెన్ను అందిస్తున్నారు.