World Telugu Conference from Dec 15 in Hyderabad

ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు మహాసభల ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల తెలిపారు. ఆఫ్రికా ఖండంలో తెలుగు మూలాలున్న వారిలో మూడోతరానికి చెందిన వారు సైతం మాతృభాష మూలాలు వెతుక్కుంటూ ఉత్సాహంగా మహాసభలకు తరలివస్తున్నట్టు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి 13 సన్నాహక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిజీ, మలాని, బోత్స్వానా, జాంబియా మొదలైన దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని, వారికి మారిగోల్డ్‌, పార్క్‌, హరితాప్లాజా తదితర హోటళ్లలో బస ఏర్పాట్లు చేశామని అన్నారు.