Kadiam srihari over see arrangements of world telugu conference

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు అందరూ ఆహ్వానితులేనని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ సభలకు దేశ విదేశాల నుంచి 8 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. నేరుగా, ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న ప్రతినిధుల సంఖ్య సోమవారానికి 8వేలకు చేరుకుంది. హాజరయ్యే ప్రతినిధులు పాల్గొనే వేదికలు, సౌకర్యాలను స్వయంగా వారితో మాట్లాడి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సభలకు జిల్లాలనుంచి హాజరయ్యే తెలుగు ఉపాధ్యాయలు, అధ్యాపకులు, ఆచార్యులు, రచయితలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులకు రవాణా, భోజన సౌకర్యాలను సంబంధిత కలర్టర్లు కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మహాసభలు తెలంగాణ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని, హాజరయ్యే ప్రతినిధులను తగిన విధంగా గౌరవించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్వహకులకు సూచించారు.