మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి

12-12-2017

మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరు కానున్నారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్రపతి తిరిగి 20న ఢిల్లీకి వెళతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. రాష్ట్రపతి రెండురోజుల పర్యటనకు హైదరాబాద్‌ వస్తున్న నేపథ్యంలో భద్రత, వసతి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న మధ్యాహ్నం 2:55 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు రాష్ట్రపతి వస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 19వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో బస చేస్తారు. 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళతారు.