అతిథులకు స్టార్‌ హోటళ్లలో వసతి - బుర్రా వెంకటేశం

07-12-2017

అతిథులకు స్టార్‌ హోటళ్లలో వసతి - బుర్రా వెంకటేశం

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే అతిథులందరికీ స్టార్‌ హోటళ్లలో తెలంగాణ ప్రభుత్వం వసతి కల్పిస్తుందని సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. మహాసభలకు వచ్చే అతిథులకు వసతులు కల్పించేందుకు నగరంలోని స్టార్‌ హోటళ్ల ప్రతినిధులతో  కలిసి చర్చించారు. సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో హోటళ్లలో వసతులు, భోజనాలు, చార్జీల గురించి సంప్రదింపులు జరిపారు.  ప్రభుత్వ ప్రతినిధులు ఆయా హోటళ్లను పరిశీలించి, తగిన సౌకర్యాలు ఉన్నాయని ధ్రువీకరిస్తేనే అతిథుల కోసం గదులు తీసుకుంటామని వెంకటేశం సృష్టం చేశారు.