ఫ్యూయల్ ఫర్ స్టార్టప్స్ పుస్తకావిష్కరణ

29-11-2017

ఫ్యూయల్ ఫర్ స్టార్టప్స్ పుస్తకావిష్కరణ

హెచ్‌ఐసీసీలో ఫ్యూయల్ ఫర్ స్టార్టప్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జీఈఎస్ ఏర్పాట్లను ఘనంగా చేశారని కొనియాడారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతం చేశారని ప్రశంసించారు. సదస్సు అనుకున్న దానికంటే మరింత విజయవంతం అయిందని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.