Global Entrepreneurship Summit 2017

జీఈఎస్ సదస్సులో మూడు రోజుల పాటు 500 అంకురాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా వారు తమ ఆలోచనలు, అమలులో ఎదురైన ఇబ్బందులు, దానిని పారిశ్రామిక అంశంగా మార్చిన తీరు, మిగిలిన వారికి ఆదర్శం ఎలా అవుతుందో కూడా వివరిస్తారు. మనసులో పుట్టిన చిన్న చిన్న ఆలోచనలకు ఈ సదస్సు పెద్ద పీట వేయనుంది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ డయానా లూసీ పెట్రాసియా లైఫీల్డ్, టెన్నిస్ ఛాంపియన్ సానియా మీర్జా, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, ఆఫ్గనిస్థాన్ సిటాడెల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇఓ రోయా మహబూబ్ వంటి వారు వివిధ అంశాలపై మాట్లాడనున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు అన్న అంశంపై ఎమిరటస్ చైర్మన్ జాన్ చాంబర్స్ , ఇవాంక ట్రంప్, ఎస్‌ఆర్‌ఎస్ ఏవియేషన్ ఎండి సిబోన్‌గైల్ సాంబో, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఎస్‌ఇబి చైర్మన్ మార్కుస్ వాలెన్‌బెర్గ్ మాట్లాడతారు. 29వ తేదీ ఉదయం సెషన్‌లో తెలంగాణ ఐటి మంత్రి కె టి రామారావు , చారీ బ్లైర్ ఫౌండేషన్ అధిపతి చారీ బ్లైర్ , ఐసిఐసిఐ బ్యాంకు ఎండి చంద కొచ్చార్, డెల్ సిసిఓ కారెన్ క్వింటోస్, ఇవాంక ట్రంప్‌లు పాల్గొంటారు. ఈ మహిళా మావనవనరుల అభివృద్ధి, శిక్షణ, మరింత మంది వివిధ పరిశ్రమల్లోకి వచ్చేలా చూడటంపై చర్చ జరుగుతుంది. ఇక 30వ తేదీన మహిళా పారిశ్రామిక వేత్తలకు ఆర్ధిక సాయం, ప్రోత్సాహం, మద్దతు అంశాలపై జరుగుతుంది. ఈ సదస్సుకు సురేష్ ప్రభు మోడరేటర్‌గా ఉంటారు. ఇందులో ఐ యూరప్ కాపిటల్ ఎండి క్రిస్టినా పెర్కిన్‌డావిసన్, వెల్‌స్పన్ ఇండియా సిఇఓ దీపాలి గోయంక, యుఎస్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్, పెట్రోలింక్ సిఇఓ లారట మాట్‌సమై, టీమ్ లీజు చైర్మన్ మానిష్ సబర్‌వాల్ ప్రసంగిస్తారు. దానికి అనుంబంధంగా జరిగే మరో సదస్సులో మార్క్‌గ్రీన్‌తో పాటు ఓవర్సీస్ ప్రైవేటు ఇనె్వస్టుమెంట్ కార్పొరేషన్ సిఇఓ రాయ్ వాష్‌బర్న్, యుఎస్ ట్రెజరర్ జోవిటా కారంజ, రెగ్యులేటరీ అఫైర్స్ అడ్మినిస్ట్రేటర్ నీయోమి రావు, డిపార్టుమెంట్ ఆఫ్ ల్యాబర్ ఉమెన్ బ్యూరో డైరెక్టర్ పాట్రాసియా గ్రీన్ మాట్లాడతారు. వీ కోర్ట్సు సంస్థ సిఇఓ వేణుగార్లపాటి సదస్సులో తమ అంకురాన్ని ప్రదర్శించనున్నారు.