ivanka will be presented the specialty gollabhama sarees

అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకకు సిద్ధిపేట కానుక అందనుంది. ఇక్కడ ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలు ఇవాంకకు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర చేర్చనున్నట్లు సమాచారం. సిద్దిపేట ప్రాంతంలో 50 ఏళ్ల నుంచి వీటిని అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. పేటెంట్‌ హక్కులు కూడా సిద్దిపేటకు దక్కాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తున్నారు. వీటిని ప్రాచుర్యంలో తేవడానికి కృషి చేస్తున్నారు. తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ సినీనటి సమంత కూడా ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తున్నారు. వీటికి మరింత గుర్తింపు తెచ్చేందుకు ఆమె స్వయంగా ఇక్కడకు వచ్చి సూచనలు ఇస్తున్నారు. కొన్ని డిజైన్లను కూడా ఆమె ఎంపిక చేశారు. ఇందులో నుంచే ఇవాంకకు గొల్లభామ చీర అందజేయడంతో పాటు అక్కడికి వచ్చే మహిళలకు ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.