world telugu conferences works observation in lb stadium

ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను తెలంగాణ సాహిత్య అకాడమి సభ్యులు పరిశీలించారు. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహకాల్లో భాగంగా మహాసభల కోర్ కమిటీ ఎల్బీ స్టేడియంలో పర్యటించింది. ఇక్కడ జరిగే ఏర్పాట్లను సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, అధికార భాషా సంఘం ఛైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పరిశీలించారు.