టీఎస్ఐపాస్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

01-09-2017

టీఎస్ఐపాస్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల ప్రశంసలు అందుకున్న టీఎస్‌ఐపాస్‌కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. స్కోచ్ - స్మార్ట్ గవర్నెన్స్ అవార్డుకు టీఎస్‌ఐపాస్ ఎంపికైంది. ఈ నెల 8, 9 తేదీల్లో ఢిల్లీలో జరిగే 49వ స్కోచ్ సదస్సులో ఈ అవార్డు అందజేస్తారని రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులకు ఆ సంస్థ సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుమతుల ప్రక్రియ సులభతరానికి సీఎం కే చంద్రశేఖర్‌రావు సూచనలతో పలు వురు పారిశ్రామికవేత్తలతో చర్చించిన రాష్ట్ర అధికారులు.. టీఎస్‌ఐపాస్‌ను రూపొందించారు. నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లోనే అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడంతో టీఎస్‌ఐపాస్‌కు గుర్తింపు లభించింది.