KTR Invited For Sri Lanka International Chamber Of Commerce

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం అందింది. ఇంటర్నేషనల్‍ చాంబర్‍ ఆఫ్‍ కామర్స్ శ్రీలంక విభాగం అధ్యర్యంలో మే 30న జరిగే సదస్సులో కొవిడ్‍ 19 దక్షిణాసియా భవిష్యత్తు పునర్‍ రూపకల్పన అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు మంత్రి కేటీఆర్‍ను కోరారు. ఇంటర్నేషనల్‍ చాంబర్‍ ఆఫ్‍ కామర్స్ ప్రపంచం లోనే అతిపెద్ద ఇండస్ట్రీ బాడీ. వందదేశాల్లో 45 లక్షలమంది సభ్యులు ఈ సంస్థకు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలతో అనేక కార్యక్రమాలు చేపడుతుంది.