KCR Meets China Jeeyar Swamy to Invite for Konda Pochamma Sagar Launching

కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవానికి విశిష్ఠ అతిథిగా హాజరుకావాలని అధ్యాత్మిక గురువు చినజీయర్‍స్వామికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‍రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం సీఎం కేసీఆర్‍, మంత్రులు శ్రీనివాస్‍ గౌడ్‍, నిరంజన్‍రెడ్డి, ఎంపీ సంతోష్‍, మైహోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుతో కలిసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‍ మండలం ముచ్చింత్‍లోని చినజీయర్‍ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు.