లాక్‍డౌన్‍ కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న లతా చౌదరి

22-05-2020

లాక్‍డౌన్‍ కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న లతా చౌదరి

కరోనా నివారణ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి నిజాంపేట వాస్తవ్యులు నారి సేన  పౌండేషన్  అధ్యక్షురాలు లతా చౌదరి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ప్రతినిత్యం సేవలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,20,000 ఆహార పొట్లాలు మరియు పది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాక ఆమె బీహార్ మరియు యూపీ వలస కార్మికులు పడుతున్న బాధలు గ్రహించి వారిని సుమారుగా 500 మందిని తమ సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది అంటే ఆమె చేసే సేవా కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయి అనటానికి ఈ  కార్యక్రమమే ఒక నిదర్శనం. ఆమె చేసే సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నిజాం పేట సాయిబాబా గుడి వద్ద సుమారు 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి మరియు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీల గోపాల్ రెడ్డి మరియు బొంతు శ్రీదేవి మాట్లాడుతూ పేద ప్రజలకు,  పేద బ్రాహ్మణులకు మరియు వికలాంగులకు గత 55 రోజులుగా లతా చౌదరి చేస్తున్న సేవలకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆమె ఎల్లప్పుడూ ఇలానే పేద ప్రజలకు సేవచేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లతా చౌదరి మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి నేను ఇంతలా ప్రజలకు సేవలు చేస్తున్నాను అంటే, దానికి ప్రధాన కారణం నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహమే అని తెలియజేశారు. ఆకలి బాధలు ఏంటో నాకు తెలుసు, అందుకే పేద ప్రజలు ఎవరూ కూడా ఖాళీ కడుపుతో పడుకోకూడదు అనే ఉద్దేశంతో నా వంతుగా కొంత మంది ఆకలి అయినా తీర్చాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని చెప్పారు.  నేను ఇంతటి గొప్ప సేవ చేస్తున్నాను అంటే దానికి మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందించిన సహకారం ఎంతో విలువైనది అని  తెలియజేశారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియజేశారు. అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులకు ధన్యవాదములు తెలియజేశారు. అలానే ప్రజలు కూడా లాక్ డౌన్ పాటించి కరోనా బారిన పడకుండా వారి ఆరోగ్యం కాపాడుకోవాలి అని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శశ, పద్మ, రాధా, సుచిత్ర, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery