తెలంగాణలో 1,699 పాజిటివ్ కేసులు

22-05-2020

తెలంగాణలో 1,699 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. వీరిలో జీహెచ్‍ఎంసీ పరిధివారు 26 మంది, రంగారెడ్డి జిల్లావాసులు ఇద్దరు, వలస కార్మికులు 10 మంది ఉన్నారు. ఐదుగురు మృత్యువాతపడగా, 23 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,699 కేసులు నమోదవగా 1,036 మంది డిశ్చార్జి అయ్యారు. 45 మంది మరణించారు. ప్రస్తుతం 618 మంది గాంధీలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‍లో పేర్కొన్నది. ప్రభుత్వం తీసుకుంటున్న అప్రమత్త చర్యలతో గత 14 రోజులుగా 25 జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదని వైద్యశాఖ పేర్కొన్నది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.