16న తెలంగాణ కేబినెట్ భేటీ

16న తెలంగాణ కేబినెట్ భేటీ

16-02-2020

16న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం 4 గంటలకు (16వ తేదీన) ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ మేరకు సమావేశానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమర్‌ను సీఎం ఆదేశించారు. బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై భేటీలో చర్చించి తేదీను ఖారారు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్‌ సమావేశాలు  జరిగే అవకాశాున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం అంశం కూడా మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. రాష్ట్రంలోని నీటి పారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్‌వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటన సందర్భంగా సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గంలో నిర్ణయాలు  తీసుకోవచ్చని సమాచారం. విద్య, ఉపాధి కోసం విదేశాకు వెళ్లి ఇబ్బందు పడే వారి కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశముంది.