దాని పట్ల ఉన్న భయమే... మనల్ని చంపేస్తుంది

దాని పట్ల ఉన్న భయమే... మనల్ని చంపేస్తుంది

16-02-2020

దాని పట్ల ఉన్న భయమే... మనల్ని చంపేస్తుంది

దేశానికి యువతే బలమని, వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఇంటర్నేషనల్‌ చైల్డ్‌ హుడ్‌ క్యాన్సర్‌ డేను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణతోపాటు నటి రష్మిక, క్యాన్సర్‌ను జయించిన పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నాలు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ చిన్నారులు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడటం బాధాకరమన్నారు. చి్డన్‌ క్యాన్సర్‌ ఫండ్‌కు విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బసవతారకం తరపున సేవందిస్తున్న వైద్యులను ప్రశంసించారు. క్యాన్సర్‌ వ్యాధికంటే ముందే మనల్ని చంపేది దాని పట్ల ఉన్న భయమే. పిల్లలు భగవంతుడితో సమానం. అలాంటి వారు క్యాన్సర్‌ బారిన పడటం బాధాకరం. ఈ వైద్యం అందరికి అందుబాటులో ఉండాలనేది నా మాతృమూర్తి అభిలాష అని బాలకృష్ణ తెలిపారు. సినీనటి రష్మిక మాట్లాడుతూ క్యాన్సర్‌ను జయించిన చిన్నారులకు చూస్తుంటే సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయన్నారు.