నిర్మలా సీతారామన్ హైదరాబాద్ పర్యటన ఖరారు

నిర్మలా సీతారామన్ హైదరాబాద్ పర్యటన ఖరారు

14-02-2020

నిర్మలా సీతారామన్ హైదరాబాద్ పర్యటన ఖరారు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండు రోజుల పాటు హైదరాబాద్‌, బెంగళూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు ఈ నెల 16, 17 తేదీలను ఖరారు చేశారు. బడ్జెట్‌లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. ఆర్థిక మంత్రి ఈ నె 16, 17 తేదీల్లో అధికారికంగా హైదరాబాద్‌, బెంగళూరుల్లో పర్యటించనున్నారు. నిర్మలా సీతారామన్ పర్యటన వివరాలను ఆర్థిక మంత్రిత్వశాఖ ట్విటర్‌లో వెల్లడించింది. ఈ రెండు నగరాల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. ఇక, రెండో సెషన్‌లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు.