haryana-businessman-offers-1-lakh-each-for-encountering-accused

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ పోలీసులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు సామాన్యుల నుంచి అటు సినీ, రాజకీయ ప్రముఖల వరకు పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన రాహ్‌ గ్రూప్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ హైదరాబాద్‌ పోలీసులకు భారీగా నజరానా ప్రకటించారు. తెలంగాణ పోలీసులు మంచి పని చేశారని.. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసుల బృందంలోని సభ్యులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు నజరానా ఇస్తానని తెలిపారు. దిశ నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ గురయ్యారు. పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోవడానికి ప్రయత్నించగా.. కాల్పుల్లో చనిపోయారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.