Telangana RTC JAC to decide on ending strike

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. భేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాని, కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అశ్వత్థామరెడ్డి కోరారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ప్రకటించారు.