27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

26-04-2019

27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు నేతలుకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్‌) అమలులో ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పతాకావిష్కరణలు జరపాలన్నారు. మంత్రులు, వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎంపీలు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, ఇతర నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.