అనుమతి ఇవ్వకపోయిన సభ నిర్వహిస్తాం: మందకృష్ణ

25-04-2019

అనుమతి ఇవ్వకపోయిన సభ నిర్వహిస్తాం: మందకృష్ణ

పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన అంబేడ్కర్‌వాదుల మహాసభకు పోలీస్‌ అనుమతి ఇవ్వాలంటూ డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందజేశారు. సభకు పోలీస్‌ అనుమతి కోరుతూ డీసీపీకి లేఖ ఇచ్చినా సమాధానం రాలేదని డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ అనుమతి ఇవ్వకపోయినా సభ నిర్వహిస్తామని చెప్పారు. 24 గంటల్లో సభకు పోలీస్‌ అనుమతి ఇవ్వకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.