టీఆర్ఎస్ లోకి గండ్ర

23-04-2019

టీఆర్ఎస్ లోకి గండ్ర

తెలంగాణలో మరో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తన భార్య జ్యోతితో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించారు. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికి రాజీనామా చేస్తానని చెప్పారు. కేసీఆర్‌ను కలిసిన అనంతరం గండ్ర లేఖను విడుదల చేశారు. జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నారు.