మేడారం సమక్క జాతర మూహూర్తం ఖరారు

22-04-2019

మేడారం సమక్క జాతర మూహూర్తం ఖరారు

మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. 2020 ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన పూజారులు సమావేశమయ్యారు. పంచాంగం చూసి జాతర తేదీలను నిర్ణయించారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమికి అటు ఇటుగా వచ్చే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో జాతరను నిర్వహిస్తారు. 5న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును గద్దెలకు తీసుకొస్తారు. 6న సమ్మక్క దేవతను గద్దెపైకి చేర్చుతారు. 7న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పిస్తారు. 8న దేవతలను వనప్రవేశం చేయిస్తారు. గిరిజన సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవానికి కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు.