రామయ్యకు ఘనంగా వసంతోత్సవం

20-04-2019

రామయ్యకు ఘనంగా వసంతోత్సవం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మూెత్సవాల్లో భాగంగా వసంతోత్సవాన్ని వైభవంగా కొనసాగించి దేవతామూర్తులపై రంగులు చల్లారు. వేకువజామునే సుప్రభాతం పలికి, నామార్చనలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వసంతోత్సవంలో సుందరమూర్తులైన సీతారాములు రంగుల్లో మరింత శోభతో దర్శనమిచ్చారు. తిరువీధిసేవ నయనానందకరంగా సాగింది. మహిళలు హారతులు అందించి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ని కీర్తించారు. నేడు చక్రతీర్థంతోపాటు ఉత్సవాలకు పూర్ణాహుతి పలకనున్నారు. బ్రహ్మూెత్సవాల కారణంగా నిలిచిపోయిన నిత్యకల్యాణాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు తెలిపారు.