అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

19-04-2019

అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

హనుమాన్‌ జయంతి సందర్భంగా శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విశ్వ హిందూ, భజరంగ్‌ దళ్‌ ఆధ్వర్వంలో ఈ యాత్ర జరుగుతుంది. గౌలీగూడలోని రామమందిరం నుంచి ప్రారంభమైన ఈ విజయ యాత్ర తాడ్‌బండ్‌ హనుమాన్‌ గుడి వరకు కొనసాగింది. వేలాదిమంది హనుమాన్‌ భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. 15 కిలోమీటర్ల  మేర ఈ యాత్ర సాగుతోంది. శోభయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు.