అటవీ శాఖ సిబ్బందికి రోటరీ క్లబ్ విశిష్ట సేవా అవార్డులు

19-04-2019

అటవీ శాఖ సిబ్బందికి రోటరీ క్లబ్ విశిష్ట సేవా అవార్డులు

క్షేత్రస్థాయిలో మెరుగయిన పనితీరు కనబరిచిన ఐదుగురు అటవీ అధికారులకు విశిష్ట సేవా పురస్కారాలను రోటరీ క్లబ్‌ ప్రకటించింది. ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, యదాద్రి-భువనగిరి జిల్లాలకు చెందిన డేనియల్‌ (ఎఫ్‌బీవో), వేణుమాధవ్‌ (ఎఫ్‌ఎస్‌వో), ఎక్కా శారద (ఎఫ్‌బీవో), రమేశ్‌ (ఎఫ్‌ఎస్‌వో), శ్రీనివాస్‌ (ఎఫ్‌బీవో)లను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఐదుగురు అటవీ అధికారులకు అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ప్రశాంత్‌కుమార్‌ ఝా పురస్కారాలను అందజేశారు. పర్యావరణ, అడవుల రక్షణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయం చేస్తామని రోటరీ క్లబ్‌ ప్రతినిధులు కిరణ్‌ పటేల్‌, మొహినుద్దీన్‌ తెలిపారు.