మోదీ ఇదే నా సవాల్ : కేసీఆర్‌

27-11-2018

మోదీ ఇదే నా సవాల్  : కేసీఆర్‌

విద్యుత్‌పై చర్చకు రావాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ మోదీతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. నిజామాబాద్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్‌లో తాగునీరు, విద్యుత్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌ అభివృద్ధిపై కూడా చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ చేశారు. తెలంగాణలో విద్యుత్‌ సమస్య ఎక్కడిది అని ప్రశ్నించారు. మోదీ ఇంత తెలివితక్కువ ప్రధాని అనుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీ అస్యతాలు మాట్లాడటం సరికాదని కేసీఆర్‌ వ్యాఖ్యనించారు.