హుజూర్ నగర్ లో ఉత్తమ్ నామినేషన్

17-11-2018

హుజూర్ నగర్ లో ఉత్తమ్ నామినేషన్

హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా హుజూర్‌నగర్‌లోని గణేశ్‌ దేవాలయం వద్ద నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయించారు. అనంతరం భారీ ర్యాలీతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ హుజూర్‌నగర్‌ ప్రాంత ప్రజలే తనకు బిడ్డలతో సమానమని అన్నారు. పీపుల్ప్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని తెలిపారు. దాదాపు 70 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. నాకు పిల్లలు లేరు.. ఈ ప్రాంత ప్రజలే నాకు పిల్లలని భావించి పనిచేశాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.