తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తలు వీరే

08-11-2018

తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తలు వీరే

ఎన్నికల ప్రచారకర్తలు (అంబాసిడర్లు)గా నలుగురిని నియమించినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండను మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఎన్నికల ప్రచారకర్తగా నియమించామన్నారు. ఇక రాష్ట్ర ప్రచారకర్తలుగా వీవీఎస్‌ లక్ష్మణ్‌, పుల్లెల గోపిచంద్‌, గోరటి  వెంకన్నను నియమించినట్లు ఆయన వివరించారు. మిగతా జిల్లాలకు కూడా ఇలాగే నియమిస్తామన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావడానికి వీరు ప్రచారం చేస్తారని తెలిపారు.