
అమలుకు నోచుకోని ఎన్నికల హామీలతో ప్రజలకు లాభమేంటని సుపరిపాలన వేదిక (గుడ్ గవర్నెన్స్) కార్యదర్శి పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో డయల్ యువర్ విలేజ్ తెలంగాణ ఎన్నారై సంస్థ రూపొందించిన పీపుల్స్ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలు తెలంగాణకు సంబంధించిన ప్రణాళఙకను తయారు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నారైలు ఉపాధి కల్పనపై దృష్టి సారించడం మంచి పరిణామన్నారు.