కాంగ్రెస్ కు జలగం ప్రసాదరావు షాక్

02-11-2018

కాంగ్రెస్ కు జలగం ప్రసాదరావు షాక్

మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ని సస్పెండ్‌ చేసింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్‌ కేంద్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ ఏకే ఆంటోని, రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమాచారం అందజేశారు. ఈ లోగానే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావు గతంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్‌ 1999లో ఆయన్ని సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.