NRI donates 3 crore rupees valuable infrastructure to Osmania hospital

ఉస్మానియా ఆస్పత్రి పట్ల ఉదారతను చాటుకున్నాడు ఓ ప్రవాస భారతీయుడు. తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడిన వైద్యుడు దాదాపు రూ.3 కోట్ల మందులు, పరికరాలను అందించాడు. మూడు భారీ వాహనాల్లో వచ్చిన మందులు, సిరంజీలు, బీపీ ఆపరేటర్లతోపాటు శస్త్రచికిత్సాలయాల్లో వాడే అతి ముఖ్యమైన యంత్రాలు, లైట్లు, సామగ్రిని ఇటీవల ఆస్పత్రికి తీసుకొచ్చారు. వరంగల్‌లో వైద్య విభ్యనభ్యసించిన చరణ్‌జీత్‌రెడ్డి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డారు. బన్ను ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆయన 3 కోట్ల సామగ్రిని ఉస్మానియా ఆస్పత్రికి డొనేట్‌ చేశారు. కొన్ని మందులు గడువు తేదికి దగ్గరలో ఉండడంతో అధికారుల సూచనల మేరకు పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సనత్‌నగర్‌లోని డ్రక్స్‌ కంట్రోల్‌ కార్యాలయానికి వాహనాలను తరలించారు. పరిశీలన అనంతరం ఉస్మానియాకు తీసుకురానున్నట్లు ఉస్మానియా వర్గాలు తెలిపాయి. చరణ్‌జీత్‌రెడ్డికి పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.