వైయస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

* ప్రకాశం జిల్లాలో రైతులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుపుకోవటం ఆనందంగా ఉంది. 
* దారిపొడవునా రైతన్నల సమస్యలు వింటున్నా. రైతన్నల సమస్యలకు వారి వద్ద నుంచి ఏవైనా సలహాలు, సూచనలు వస్తాయని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 
* బాబు నాలుగేళ్ల పాలనలో రైతన్నల ముఖంలో చిరునవ్వు మాయమైంది. బాబు మోసాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 
* చంద్రబాబు రూ.87,612 కోట్ల రుణమాఫీ మోసం చేశారు. రుణమాఫీ మోసం వల్ల రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోవటం లేదు. 
* గత ప్రభుత్వాలు సున్నా వడ్డీల కోసం బ్యాంకులకు డబ్బులు కట్టేవి. దీంతో బ్యాంకులు రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలు అందించేవి. 
* బాబు అధికారంలోకి వచ్చాక బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టడం మానేశారు. 
* వ్యవసాయ రుణాలు యావరేజ్ గా రూ.50 వేల కోట్లు తీసుకున్నా.. ప్రభుత్వం రూ.2వేల కోట్లు వడ్డీని బ్యాంకులకు చెల్లించాలి. అది బాబు చేయటం లేదు. 
* నాలుగు సంవత్సరాలుగా రైతన్న ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. 

* ప్రకాశం జిల్లాలో శెనగ, మినుము, కంది, పొగాకు, జామాయిల్ ఎక్కువగా సాగు చేస్తారు. శెనగకు ఉత్పత్తికి అయ్యేది రూ.5,600 పైగా ఖర్చు అయితే.. మార్కెట్ లో రూ.3,500లోపు మాత్రమే ధర వస్తోంది. అమ్ముకుంటే రైతన్నకు నష్టాలు వస్తున్నాయి. రైతన్న నుంచి దళారీల దగ్గరకు వెళ్లాక ధర ఆకాశానికి అంటుతోంది. మినుములు మిగతా పంటలకూ ఇదే పరిస్థితి. జామాయిలు విషయానికి వస్తే టన్నుకు రూ.1800కు అడుగుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి.

* 4వేల కోట్లతో శ్రీ జగన్ ధరల స్థిరీకరణ నిధి పెడతారా? నేను (చంద్రబాబు) రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని మోసం చేశారు. 

* రైతులకు ధరలు రావటం లేదు. దీనికి కారణం ఈయనే దళారీలకు నాయకుడు. ఈయనకు హెరిటేజ్ షాపు ఉంది. హెరిటేజ్ లాభం కోసం పాలు, కూరగాయల నుంచి.. మినుము, శెనగ.. వంటివన్నీ తక్కువకే కొని ప్యాకేజ్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. 

* రాష్ట్రంలో రైతన్నలు దగా పడుతున్నారు. ప్రకాశం జిల్లాలోనే రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. నేను స్వయంగా వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించాను. 10 సంవత్సరాల క్రితం ఖర్చులు తక్కువ. ఇప్పడు అన్నీ ధరలు పెరిగాయి. అయినా పొగాకు ధరలు పెరగటం లేదని రైతన్నలు ఆవేదన పడుతున్నారు.

* కేబినెట్ సమావేశాలు జరుగుతాయి. కానీ కరువు మండలాలు మాత్రం డిక్లేర్ చేయటం లేదు. ఖరీఫ్ లో బీమా కింద కట్టాల్సిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు. రబీ పంట వేసే టైంకి రైతన్నలకు కాస్తో, కూస్తో డబ్బు ఇప్పించాలన్న ప్రయత్నం చేయాలి. 

* రాష్ట్ర ప్రభుత్వం బీమా కట్టలేదు కాబట్టి.. కేంద్ర ప్రభుత్వమూ ఇచ్చే పరిస్థితి లేదు. 
* రైతన్న వ్యవసాయాన్ని పండుగలా చేయాలి. అందుకోసం నవరత్నాల్లో పథకాలు ప్రకటించాం. 
* నవరత్న పథకాల కంటే మెరుగ్గా చేయాలంటే సలహాలు, సూచనలు ఇవ్వమని కోరిన వైయస్ జగన్. 

*  మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైతన్న వ్యవసాయం చేయటానికి ప్రధాన సమస్య పెట్టుబడి. పెట్టుబడి ఖర్చు తగ్గితే ఆదాయం ఎక్కువ అవుతుంది. పెట్టుబడులు తగ్గించటానికి రైతన్నలకు 9 గంటల పాటు పగటిపూటే ఉచితంగా కరెంటు ఇస్తాం. కరెంటు ఉచితంగా ఇవ్వటం వల్ల పెట్టుబడుల్లో అయ్యే ఖర్చు తగ్గుతుంది. వడ్డీ లేకుండా వ్యవసాయ రుణాలు ఇప్పిస్తాం. ఆ వడ్డీ డబ్బులు బ్యాంకులకు ప్రభుత్వం కడుతుంది. రైతన్నలకు మే నెలలో రూ.12,500 ఇస్తాం. దీని ద్వారా పెట్టుబడులు ఖర్చు బాగా తగ్గుతాయి. ఐదు జిల్లాలు తిరిగి ఆరో జిల్లాకు వచ్చాను. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవటానికి బోర్లు వేయటం. బోర్ల కోసం అప్పులు చేసి.. అది చేంతాడంత అయి రైతన్నను మింగేస్తోంది. రాష్ట్రంలో బోర్లు వేయించాలంటే.. బోర్లు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తాం. ఏ రైతన్న కూడా బోర్లు వేయటానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్టిన తర్వాత పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర లేక ఇబ్బందిపడుతున్నారు. మన ప్రభుత్వం వచ్చాక రైతు ముఖంలో చిరునవ్వు వచ్చే రేటును ముందుగానే ప్రకటిస్తాం. మూడు వేల కోట్లు నష్టం వచ్చినా ఫర్వాలేదు రైతన్నకు తోడుగా ఉంటామని ప్రకటించిన శ్రీ వైయస్ జగన్. గిట్టుబాటు ధరలపై భరోసా ఇస్తాం. కోల్డ్ స్టోరేజీలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నియోజకవర్గం స్థాయిలో తీసుకువస్తాం. 

* గిట్టుబాటు ధరల విషయంలో రైతన్నకు మనం చేయబోయే రెండో మంచి ఉంది. పాడి ఉన్న ఇంట సిరులు పొంగునట.. కవ్వమాడు ఇంటి కరువే ఉండదట. మన ఖర్మ కొద్దీ.. రైతులకు మేలు చేయాల్సిన చోట.. కీడు చేస్తున్నారు. పాల వ్యాపారంలో ఆయన రావటం మనం చేసుకున్న ఖర్మ. ఏ జిల్లాకు పోయినా కో ఆపరేటివ్ యూనిట్లు అన్నీ మూతపడుతున్నాయి. చిత్తూరు డెయిరీ నుంచి ప్రకాశం డెయిరీ వరకు మూతపడుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రకాశం డెయిరీ 80 కోట్ల నష్టాల్లో తేలుస్తున్నారు. ప్రయివేటు డెయిరీలు ఎంత చెబితే అంతకే కొనాలి. కో ఆపరేటివ్ డెయిరీలు మంచి రేటు ఇస్తే.. అప్పుడు ప్రయివేటు డెయిరీలు కూడా ఇవ్వాలి. హెరిటేజ్ డెయిరీల కోసం కోఆపరేటివ్ డెయిరీలు మూతపడేలా బాబు సింపుల్ గా చేస్తున్నారు. పాలు పోస్తే రైతులకు డబ్బులు ఇవ్వటం తగ్గించేస్తారు. మన ప్రభుత్వం వస్తే పాడిని ప్రోత్సహిస్తాం. కోఆపరేటివ్ డెయిరీ ప్రోత్సహిస్తాం. లక్షా 10వేల నుంచి లక్షా 30వేల లీటర్లు తీసుకునేది. లక్షన్నర అంత కంటే ఎక్కువ తీసుకునేలా పునరుద్ధిస్తాం. వాళ్లు పోసే ప్రతి పాలకు రూ.4లు సబ్సిడీ ఇస్తాం. ఎప్పుడైతే కోఆపరేటివ్ రంగంలో రూ.4లు సబ్సిడీ ఇచ్చి తీసుకుంటారో, ప్రయివేటు వాళ్లు కూడా అంతే ఎక్కువ ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. 

* రైతులకు హఠాత్తుగా కరువు, వర్షాలు వస్తే ఇన్ పుట్ సబ్సిడీ, బీమా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి రైతన్నకూ తోడుగా ఉండేందుకు మనం ప్రక)తి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రం రూ.2వేల కోట్లు, కేంద్రం రూ.2వేల కోట్లు ఇస్తుంది. దీనివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. రైతన్నకు ప్రభుత్వాల తరుపు నుంచి భరోసా వస్తుంది. 

* ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వెలిగొండ ప్రాజెక్టు ఎక్కడేసినది అక్కడే ఉంది. ప్రాజెక్టుల నుంచి లంచాలు ఎలా తీసుకోవాలి అన్న ఆలోచన ఉంది. పెండింగ్ లో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నాధ్యాస రైతన్న ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఉంది తప్ప కమీషన్లు మీద కాదు. 

* ఇంతకంటే మంచిగా మెరుగైన సలహాలు, సూచనలు ఉంటే చెప్పమని శ్రీ వైయస్ జగన్ రైతన్నలను కోరారు.

A group of women from Malapadu village met YSRC President YS Jagan Mohan Reddy on Tuesday during his Padayatra at Malapadu village of Kondapi AC.

Their plight was to shut down the liquor shops in their village. They told the opposition leader that many youngsters are getting addicted to alcoho. They requested Jagan to take steps to close all the wine shops completely.

Mr. Jagan Reddy assured them that he will definitely make Andhra Pradesh a alcohol free State by closing the shops in three phases once YSRCP forms government.

 

Click here for Photogallery