మైనార్టీ సోదరులతో జగన్ ఆత్మీయ భేటీ
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారు. 
చంద్రబాబు మైనార్టీలకు రూ.2500 కోట్లు బడ్జెట్ లో పెడతామన్నారు?
మరి, రూ.2500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించిన జగన్. 
రంగనాథన్ కమీషన్ సిఫార్సుల మేరకు.. ముస్లిం రిజర్వేషన్లు అని చంద్రబాబు అన్నారు. 
మరి ఆ రిజర్వేషన్లు ఏమయ్యాయి?
లక్ష వరకు వడ్డీలేని రుణాలు అన్నారు? అవి ఏమైంది?

- వైయస్ జగన్.. 

బాబు నాలుగేళ్లలో ప్రతి కులాన్ని, ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశారు. టీడీపీ 2014 ఎన్నికల ప్రణాళిక కోసం వెబ్ సైట్ లో చూస్తే కనిపించదు. అది కనిపిస్తే ప్రతి కులం, ప్రతి ఒక్కరూ కొడతారని భయం. అందుకే.. ఆయన టీడీపీ మేనిఫోస్టోను వెబ్ సైట్లో పెట్టుకోలేదన్న శ్రీ జగన్. ముస్లిం సోదరులకు ఎవరైనా మంచి చేశారంటే.. గర్వంగా చెబుతాను. ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి మాత్రమే అని గర్వంగా చెబుతాను. నాన్నగారి హయాంలో పరిపాలన ఎలా ఉందో.. బాబు పాలన పరిపాలనకు తేడా చూస్తే.. మీకే తెలుస్తుందన్నారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. 

నాన్నగారి హయాంలో పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు చదువుతామంటే భరోసా ఇచ్చారన్నారు. ఆ రోజుల్లో ఆరోగ్యం బాగోలేదంటే.. ఏ సమస్య వచ్చినా.. ఒక భరోసా ఉండేదన్నారు. కేవలం వారు చిరునవ్వుతో 108 నెంబర్ ఫోన్ చేస్తే చాలన్నారు. వాళ్ల ఇంటికి కుయ్... కుయ్ అంటూ అంబులెన్స్ వచ్చేదన్నారు. తద్వారా ఆరోగ్యంపై భరోసా నాన్నగారి హయాంలో ఉండేదన్నారు. పేదరికంలో చాలా మంది ముస్లింసోదరులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేయి వేసి ఆలోచించి చెప్పమన్నారు. ఇంజనీరింగ్ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. అయితే, బాబు మాత్రం ముష్టివేసినట్లు 35వేలు ఇస్తున్నారని మండిపడ్డారు.

బాబు హయాంలో మన పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చదివించే స్థాయి మనకు ఉందా అని శ్రీ జగన్ అడిగారు. నాన్నగారు వచ్చి ఒకడుగు ముందుకు వేసి పేదవాళ్ల జీవితాల్లో చిరునవ్వులు తెచ్చారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు వచ్చారు. మన పిల్లల్ని చదివించే పరిస్థితి లేదన్నారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎంత పేదవాడైనా తన కుటుంబ సభ్యుల్ని బతికించుకోవటానికి తాహతు పడతారు. మంచి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తహతహలాడతారు. మంచి ఆసుపత్రులు అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. 60 ఏళ్లు రాజధానిగా ఉండబట్టే అక్కడ ఆసుపత్రులు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ఇవ్వరట. నెట్ వర్క్ ఆసుపత్రులు అన్నీ కూడా 8, 9 నెలలు నుంచి బిల్లులు పెండింగ్ లో పెట్టారు. మరి, ఆసుపత్రికి వెళ్లే వైద్యం చేయించే పరిస్థితి ఉందా అన్నారు. 108 ఫోన్ చేస్తే.. డీజిల్ లేదనో, టైర్లు బాగోలేదనో సమాధానం వస్తోందన్నారు. అప్పులు పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితులు అన్నీ మారుస్తూ ప్రతిపేదవాడికీ తోడుగా ఉండేలా చేస్తాం. నవరత్నాలు ప్రకటించాం. మీ పిల్లల్ని బడులకు పంపిస్తే.. వారు పెద్ద చదువులు చదివితే పేదరికం నుంచి బయటపడతారు. అప్పుడే బతుకులు మారుతాయి. అందుకే.. ప్రతి తల్లికి భరోసా ఇచ్చాం.

ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నాం. వెయ్యి రూపాయలకు పైన ఖర్చైనా మేమే భరిస్తాం. ఆపరేషన్ అయ్యాక రెండు, మూడు, ఆరు నెలలకు అయినా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తే ఆ సమయంలో డబ్బు ఇస్తామని  శ్రీ జగన్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్ లో చేయించుకున్నా పర్వాలేదు, బెంగలూరు, చెన్నైలో చేయించుకున్న పర్వాలేదన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి మందుల ఖర్చు పెరుగుతోంది. అలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పింఛను రూ.10వేలు అని శ్రీ జగన్ ప్రకటించారు. అవ్వా,తాతలకు వయస్సు పెరిగే కొద్దీ మందుల అవసరమూ ఉంటుంది. పింఛనును రెండు అడుగులు ముందుకు వేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పనులకు వెళ్తే తప్ప కడుపు నిండని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. పింఛను రెండువేలు ఇవ్వటమే కాక వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇమామ్, మౌజీలకు చంద్రబాబు ప్రకటించిన ఏదీ ఇవ్వటం లేదు. ఇమాంలకు పదివేలు, మౌజీలకు 5వేలు ఇస్తామన్నారు. మసీదు, చర్చి, గుడి అయినా ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఇస్తామన్నారు. ఒక్కోదానికి 15వేలు ఇచ్చి తోడుగా ఉంటామన్నారు. ఏ మనిషి అయినా గుడికి పోవాలి. చర్చికి, మసీదుకు పోవాలి. ఖాళీ సమయంలో దేవుడిని ప్రార్థించినప్పుడు మంచి, చెడు తెలుస్తుంది. ఆ ద్వారం మూసుకోకూడదని శ్రీ జగన్ తెలిపారు. మనకు మంచి చేయటం కోసం.. సందేశాలు ఇచ్చేవారు సంతోషంగా ఉండేందుకు .. తోడుగా ఉంటామన్నారు. మీ అందరి నుంచి సూచనలు, సలహాలు ఇవ్వమని శ్రీ జగన్ కోరారు.

Click here for Photogallery