YS Jagan Praja Sankalpa Yatra 24th Day end

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 24వరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఆయన ఇవాళ మొత్తం 15.6 కిలోమీటర్లు నడిచారు. శనివారం ఉదయం పత్తికొండ మండల కేంద్ర శివారులో ప్రారంభమైన పాదయాత్ర భోజన విరామ సమయానికి తుగ్గలి మండలం రాతల గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత తుగ్గలి, గిరిగిట్ల గ్రామాల మీదుగా సాగిన  పాదయాత్ర మదనంతపురం వద్ద ముగిసింది. కాగా పత్తికొండ నియోజకవర్గంలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేతకు ప్రతిచోట  ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ గ్రామాలకు వస్తున్న జగన్‌కు పలుచోట్ల ప్రజలు కష్టాలు, బాధలను చెప్పుకున్నారు. అందరి కష్టాలు ఒపికగా విన్న జగన్ వచ్చేది రాజన్న రాజ్యమేనని అందరి కష్టాలు తొలిగిపోతాయంటూ భరోసా నిచ్చారు.