YS Jagan meeting with BCs

వైయస్ఆర్ హయాంలో విశ్వబ్రహ్మణుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని అనేక జీఓలు ఇచ్చారని బాబు హయాంలో అవేమీ అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అర్జీని శ్రీ వైయస్ జగన్ గారు పరిశీలిస్తామని స్వీకరించారు. 

చాలా చోట్ల అంటరానితనం, భూస్వాములు దాడులు చేస్తున్నారని చంద్రబాబు సొంత నియోజకవర్గంలో రజక వ)త్తులు చేస్తున్నవారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని శ్రీ జగన్ ద)ష్టికి తీసుకువచ్చారు. బీసీలకు కూడా ఎస్సీ, ఎస్టీ వంటి సామాజిక చట్టాలు తీసుకురావాలని కోరారు. 

ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ.. బీసీల కోసం చంద్రబాబు సబ్ ప్లాన్ ప్రకటించారని కానీ అందులో 20శాతం కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఏటా 10వేల చొప్పన ఖర్చు పెట్టాల్సి ఉండగా.. ఆయన అందులో 20-22% కూడా ఖర్చు చేయలేదని బీసీ సోదరులకు వివరించారు. బోయల్ని కర్నూలు నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ ఎంపీగా పంపిస్తానని హామీ ఇచ్చారు. చిత్తశుద్ధితో హామీ ఇస్తున్నానని శ్రీ జగన్ తెలిపారు.కురువల్ని ఆదుకోవాలని ఆ సామాజిక యువకుడు విశ్వేశ్వర్ కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చారు. మన పార్టీకి సంబంధించి బీసీ కమిటీ ఏర్పాటు చేశామని పార్టీ సీనియర్ నాయకులు అంతా ప్రతి జిల్లా తిరుగుతారని.. ఆ జిల్లాల్లో 4 మీటింగ్ పెట్టి.. బీసీలంతా ఒకతాటి మీదకు తీసుకువస్తారని అన్నారు. బీసీ కమిటీ సభ్యులంతా నివేదిక తయారు చేస్తారన్నారు. ప్రజాసంకల్ప యాత్ర తర్వాత బీసీ గర్జన నిర్వహిద్దామని శ్రీ జగన్ పిలుపు ఇచ్చారు. బీసీ గర్జనలో ప్రతి కులానికీ మేలు జరగటానికి బీసీ డిక్లరేషన్ చేద్దామన్నారు.